మైగ్రేన్ ఉంటే మీరు కొన్ని విషయాలపై కచ్చితంగా దృష్టిపెట్టాలి. లేదంటే మైగ్రేన్ ట్రిగర్ అవుతుంది.

చిన్నవే కదా అని విస్మరిస్తే.. మైగ్రేన్ ఎక్కువ అవుతుంది. వాంతులు కూడా అవ్వొచ్చు.

లైట్స్, సౌండ్స్​కి మైగ్రేన్ ట్రిగర్ అవుతుంది. కాబట్టి తక్కువ లైట్స్, సౌండ్స్ ఉండేలా చూసుకోవాలి.

ఒత్తిడి, సరైన నిద్రలేకపోవడం, వాతావరణం, కొన్నిరకాల ఫుడ్స్ మైగ్రేన్​ను బాగా ప్రేరేపిస్తాయి.

యాంటీ ఇన్​ఫ్లమేటరీ, మెగ్నీషియం ఎక్కువగా ఉండే హెల్తీ ఫుడ్స్ తీసుకోవాలి. ఇవి మైగ్రేన్​నుంచి ఉపశమనం ఇస్తాయి.

హైడ్రేషన్ అనేది చాలా ముఖ్యం. డీహైడ్రేట్ అయితే మైగ్రేన్ ట్రిగర్ అవుతుంది.

సమతుల్య ఆహారం శరీరంలో చక్కెరలను అదుపులో ఉంచుతుంది. మైగ్రేన్ రాకుండా చేస్తుంది.

బాగా వేయించిన, ఆల్కహాల్, కెఫీన్ కలిగిన పదార్థాలకి ఎంత దూరముంటే అంత మంచిది.

మైగ్రేన్ వస్తే ఐస్ ప్యాక్​ని తలపై పెట్టుకుని.. డార్క్ రూమ్​లో రిలాక్స్ అయితే తగ్గుతుంది.

ఇవన్నీ కేవలం అవగాహన కోసమే. వైద్యుల సలహా తీసుకుంటే మంచిది. (Images Source : Envato)