ఉదయాన్నే నిద్ర లేవడం వల్ల ఉదయం పూట చాలా సమయం కలిసొస్తుంది.

అందరూ ఉదయాన్నే నిద్రలేవాలనే అనుకుంటారు. కానీ లేవలేరు.

కొన్ని చిన్న చిన్న చిట్కాలతో నిద్ర లేవడం సులభమవుతుంది.

మనలో చాలా మంది రాత్రి పూట చాలా సమయం పాటు మెలకువగా ఉండే అలవాటు ఉంటుంది. ఇది ఉదయం నిద్రలేచేందుకు పెద్ద ఆటంకం.

ఉదయం నిద్రలేవడానికి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. దీనికి కట్టుబడి ఉండడం వల్ల మంచి ఫలితం ఉండొచ్చు.

ఇప్పటికిప్పుడు రేపు ఉదయాన్నే నిద్ర లేవాలనే నిర్ణయం చేసుకుని నాలుగింటికల్లా లేచేద్దామని అనుకోవద్దు.

రోజూ లేచే సమయానికి ఒక అర గంట ముందు నిద్రలేవాలన్న లక్ష్యంతో మొదలు పెడితే క్రమంగా అనుకున్నది సాధించడం సాధ్యమవుతుంది.

రేపు ఉదయం త్వరగా నిద్ర లేవాలని ఈరోజు రాత్రి నిద్ర రాకపోయినా నిద్ర కోసం ప్రయత్నం చేస్తే పెద్ద లాభం ఉండదు.

నిద్రరాకుండానే నిద్రపోవాలని ప్రయత్నిస్తే అది ఇన్సోమ్నియాకు కారణం అవుతుందని స్లీప్ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు.

మనలో చాలా మందికి వీక్ డేస్ నిద్ర లేచేసమయం వికెండ్ లో నిద్ర లేచే సమయాల్లో తేడాలుంటాయి. ఇది సిర్కాడియన్ రిథమ్ ను ఆటంకపరుస్తాయి.

రోజూ ఉదయం ఒకే సమయానికి వెలుతురు చూడడం వల్ల కూడా త్వరగా నిద్ర లేవవచ్చు.

Image Source: Pexels

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే