మెగా కోడలు ఫుడ్ బిజినెస్‌- లోగో ఆవిష్కరించిన చిరు మదర్

మెగా కోడలు ఉపాసన కొణిదెల ఫుడ్ బిజినెస్‌ ప్రారంభించింది.

‘అత్తమ్మ కిచెన్’ పేరుతో చిరంజీవి సతీమణి సురేఖ వంటకాలను మార్కెట్‌లోకి తీసుకొస్తుంది.

సురేఖ కొణిదెల పుట్టినరోజు సందర్భంగా ఫిబ్రవరి 18న ఈ బిజినెస్ ప్రారంభించింది.

కొణిదెల వంటకాలను ‘అత్తమ్మ కిచెన్' ద్వారా అందరితో పంచుకోబోతోంది.

‘అత్తమ్మ కిచెన్' ప్రొడక్ట్స్‌ లో కొణిదెల ఇంటి సంప్రదాయ వంటకాలు ప్రత్యేకంగా ఉంటాయి.

ఇంట్లో వండిన ఆహారాన్ని తినాలనుకునే వారికి ఈ ఫుడ్స్ ఉపయోగపడనున్నాయి.

‘అత్తమ్మ కిచెన్’ పేరుతో పులిహోర, రసం, ఉప్మా లాంటివి ఇన్‌స్టంట్‌గా తయారు చేసుకునే అవకాశం ఉంది.

తాజాగా ‘అత్తమ్మ కిచెన్’ లోగోను మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి ఆవిష్కరించారు.

All Photos & Videos Credit: Atthamma’s Kitchen/Instagram