ఉపవాస ఆంక్షలు

శివరాత్రి సమయంలో తినాల్సిన ఫుడ్స్, తినకూడనివి ఇవే

Published by: Geddam Vijaya Madhuri

మహా శివరాత్రి సమయంలో చాలామంది ఉపవాసం చేస్తారు. కొందరు మంచి నీరు కూడా తీసుకోకుండా ఫాస్టింగ్ ఉంటారు.

మరికొందరు వివిధ ఆరోగ్య సమస్యల దృష్ట్యా కొన్నిరకాల ఫుడ్స్ తీసుకుంటూ ఉపవాసం చేస్తారు.

మీరు కూడా అలా ఏమైనా శరీరానికి అందిస్తూఉపవాసం చేయాలనుకుంటే తినకూడని పదార్థాలు, తినాల్సిన ఫుడ్ ఏంటో చూసేద్దాం.

సగ్గు బియ్యం, బంగాళదుంపలు, వేరుశనగలతో చేసిన ఫుడ్​ని తినొచ్చు.

పండ్లు, డ్రై ఫ్రూట్స్​ని కూడా ఉపవాసం మధ్యలో షుగర్ లెవెల్స్​ని కంట్రోల్ చేయడానికి తీసుకోవచ్చు.

ఖీర్, పాయసం వంటి పాల ఉత్పత్తులను, ప్రసాదాలను తినవచ్చు.

కొబ్బరి నీళ్లు, హెర్బల్ డ్రింక్స్ తీసుకుంటూ ఉంటే డీహైడ్రేషన్​కి గురికాకుండా ఉంటారు.

శివరాత్రి పూజ చేసేవారు నాన్​వెజ్​, వెల్లుల్లి, ఉల్లిపాయ, ధాన్యాలు, ఆల్కహాల్ వంటి వాటికి దూరంగా ఉండాలి.

ఉపవాసం తర్వాత లైట్​ ఫుడ్​తో ఫాస్టింగ్​ని బ్రేక్ చేయాలి.