లిచీ పండ్లు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తాయి. అయితే దీనిని సమ్మర్​లో తింటే హెల్త్​కి మరింత మంచిది.

లీచీల్లో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కణాల నష్టాన్ని నివారిస్తాయి.

విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. సీజనల్ సమస్యలు రాకుండా హెల్ప్ చేస్తుంది.

చర్మానికి అవసరమైన కొల్లాజెన్ ఉత్పత్తిని అందిస్తుంది. చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.

లిచీలో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.

లిచీలు తియ్యగా మంచి రుచిని అందిస్తాయి. పైగా పూర్తిగా నీటితో ఉండి.. హైడ్రేషన్​ని అందిస్తాయి.

రక్త ప్రసరణను మెరుగు పరిచి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును కూడా కంట్రోల్ చేస్తుంది.

ఎర్ర రక్త కణాలను పెంచి.. శరీరానికి శక్తిని అందిస్తుంది. ఎనర్జిటిక్​గా ఉండేలా చేస్తుంది.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు ఫాలో అయితే మంచిది.