సమ్మర్​లో చాలామంది బీర్ తాగుతూ ఉంటారు. చిల్డ్​ బీర్ తాగితే మంచి ఫీల్​ వస్తుందనుకుంటున్నారు.

అయితే సమ్మర్​లో బీర్​ తాగితే ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని చెప్తున్నారు.

సమ్మర్​లో బీర్​ తాగితే కూల్​గా ఉంటుందనుకుంటారు కానీ అది డీహైడ్రేషన్ సమస్యను పెంచుతుంది.

యూరిన్ ఎక్కువగా వచ్చేలా చేస్తుంది. చెమట ఎక్కువగా వస్తుంది. దీనివల్ల డీహైడ్రేషన్, కళ్లు తిరగడం వంటి సమస్యలు వస్తాయి.

శరీరంలో ఉష్ణోగ్రతను పెంచుతుంది. మరింత హీట్​ని విడుదల చేసి హీట్ స్ట్రోక్​కి గురయ్యేలా చేస్తుంది.

బీర్​ తాగితే కడుపు ఉబ్బరం, తేనుపులు వంటివి రావడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి.

బీర్ తాగితే రిలాక్స్ అవుతుందని అనుకుంటారు కానీ.. ఆల్కహాల్ నిద్ర సమస్యలను పెంచుతుంది.

బీర్​లో క్యాలరీలు ఉంటాయి. ఇవి బరువు పెరిగేలా చేస్తాయి. ముఖ్యంగా పొట్ట కొవ్వును పెంచుతాయి.

ఆల్కహాల్ తీసుకోవడం వల్ల స్కిన్ సెన్సిటివ్ అవుతుంది. సన్​లైట్​లోకి వెళ్లేప్పుడు స్కిన్ డ్యామేజ్ ఎక్కువగా ఉంటుంది.

బీర్​ తాగినప్పుడు డీహైడ్రేషన్ రాకుండా మీరు ఎక్కువగా నీటిని తీసుకుంటే మంచిది.