హెల్తీ డ్రింక్

సమ్మర్​లో లెమన్ టీ తాగితే ఆరోగ్యానికి కలిగే లాభాలివే

Published by: Geddam Vijaya Madhuri

లెమన్ టీ మిమ్మల్ని హైడ్రెటెడ్​గా ఉంచుతుంది. శరీరానికి కావాల్సిన ఎలక్ట్రోలైట్​లు అందుతాయి.

మెరుగైన జీర్ణక్రియ మీ సొంతమవుతుంది. కడుపు ఉబ్బరాన్ని, వికారాన్ని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది.

దీనిలోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టకుండా హెల్ప్ చేస్తుంది.

లెమన్​ టీలోని యాంటీఆక్సిడెంట్​ లక్షణాలు కణాలు డ్యామేజ్ కాకుండా హెల్ప్ చేస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడిని దూరం చేస్తాయి.

మొటిమలు తగ్గించి.. స్కిన్​ హెల్త్​ని మెరుగుపరచడంలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు కృషి చేస్తాయి.

మెటబాలీజంను పెంచి.. జీవక్రియను మెరుగుపరుస్తుంది. ఆకలిని కంట్రోల్ చేసి బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుంది.

సమ్మర్​ వేడి నుంచి రిలీఫ్ ఇస్తుంది. ఎండలో తిరిగితే కలిగే అలసటను ఇది దూరం చేస్తుంది.

లెమన్​ టీలోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు నోటి దుర్వాసనను దూరం చేసి.. గమ్ బ్యాక్టీరియాను తగ్గిస్తాయి.

దీనిని రోజుకు రెండు లేదా మూడుసార్లు తీసుకోవచ్చు.