హెల్తీ స్కిన్ హీరోయిన్లకి ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు. ఈ హెల్తీ లుక్ కోసం కృతి సనన్ కూడా ఓ రోటీన్ ఫాలో అవుతుంది. స్కిన్ కేర్ ఫాలో అయ్యేముందు స్నానం చేసి.. చేతులు కూడా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలంటుంది. ఐస్ క్యూబ్స్‌లో నీరు వేసి.. ముఖాన్ని దానిలో ఉంచుతుందట కృతి. దీనివల్ల స్కిన్ ముడతలు రాకుండా ఉంటుందట. సాధారణంగా స్కిన్‌ని హైడ్రేటింగ్‌గా ఉంచుకునేందుకు హైడ్రేటింగ్ మాస్క్ ఉపయోగిస్తుందట కృతి. ట్యాన్, పింపుల్స్ ఉన్నప్పుడు మాత్రం డీటాక్సింగ్ మాస్క్‌ని అప్లై చేస్తుందట. కళ్లకు గ్రీన్ టీ, కెఫిన్‌తో కూడిన అండర్ ఐ ప్యాచెస్ ఉపయోగిస్తుందట కృతి సనన్. గ్లిజరిన్ లేదా రోజ్ వాటర్‌ని టోనర్‌గా ఉపయోగిస్తుందట. ఇది చర్మం పొడిబారకుండా హెల్ప్ చేస్తుందని తెలిపింది. ఫేస్‌కి గ్లోయింగ్ సీరమ్‌ని కచ్చితంగా అప్లై చేస్తుంది. మాయిశ్చరైజర్‌ని ఎక్కువగా ఉపయోగించదట కానీ.. సన్‌స్క్రీన్ లేకుండా అస్సలు ఉండదట కృతి.