పుచ్చకాయ కొనే ముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి!

పుచ్చకాయలు వేసవిలో శరీరానికి చలువ, ఉత్తేజాన్ని ఇస్తాయి.

అధిక నీటిశాతం ఉండే ఈ పండును తింటే డీహైడ్రేష‌న్ నుంచి త‌ప్పించుకోవ‌చ్చు.

అయితే, పుచ్చకాయలను కొనేముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

పుచ్చకాయల్లో ఆడ, మగ జాతులు ఉంటాయి.

ఆడ జాతి పుచ్చకాయలు గుండ్రంగా తియ్యగా ఉంటాయి.

మగజాతి పుచ్చకాయలు కోడిగుడ్డు ఆకారంలో ఎక్కువ నీటిశాతం, గుజ్జును కలిగి ఉంటాయి.

బరువుగా ఉన్న పుచ్చకాయలో నీళ్లు, గుజ్జు ఎక్కువగా ఉంటాయి.

చక్కగా పండిన పుచ్చకాయలు ముదురు ప‌చ్చ రంగులో ఉంటాయి.

పుచ్చకాయ నుంచి తియ్యటి వాసన వస్తే మంచిది. మరీ ఎక్కువ వాసన వస్తే చెడిపోయినట్లు గుర్తు.

All Photos Credit: pixabay.com