కార్తీకదీపం సీరియల్‌తో వంటలక్కగా ఎంతో ఫేమ్ తెచ్చుకుంది ప్రేమి విశ్వనాథ్. కెరీర్‌ను ఫ్యామిలీ లైఫ్‌ను రెండింటీని బ్యాలెన్స్ చేస్తూ సక్సెస్‌ఫుల్‌గా ముందుకు వెళ్తోంది. కేరళకు చెందిన ఈ భామ.. అదే ప్రాంతానికి చెందిన వినీత్ భట్ని ప్రేమించి పెళ్లాడింది. తాజాగా ఈ భామ తన ఇన్‌స్టాలో ఓ రీల్ షేర్ చేసింది. దానిలో తన కొడుకుతో ఫన్నీగా వీడియో చేసింది. కొడుకుతో రీల్ చేసిన వంటలక్క ఆ వీడియో చూసిన వాళ్లు వామ్మో.. మేడమ్ మీకు ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా అంటూ షాక్ అవుతున్నారు. ప్రేమికి ఓ కూతురు కూడా ఉంది. ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మాత్రం రీల్ చూసిన ప్రతి ఒక్కరికీ ఆమె కొడుకే హాట్ టాపిక్‌గా మారాడు. కండలు తిరిగిన సౌష్టవంతో.. ఆమెకి తమ్ముడిలా ఉన్నాడంటూ ప్రేమి అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. ప్రేమి విశ్వనాథ్ ఫ్యామిలీ ఫోటోలు, వీడియోలు (Images Source : Premi Vineeth Bhatt)