బాలీవుడ్ హీరోయిన్ జాన్వీకపూర్ మరోసారి వార్తల్లో నిలిచింది.

తన లవర్ నేమ్ వచ్చేలా నెక్లెస్ డిజైన్ చేయించుకుని.. మీడియా దృష్టిలో పడింది.

తాజాగా ఓ ఈవెంట్​కి హాజరైన జాన్వీ తన షీకూ పేరుతో ఉన్న డైమండ్ నెక్లెస్ వేసుకుంది.

ఇప్పటివరకు షీకూ తనకి ఫ్రెండ్ మాత్రమేనని చెప్పిన జాన్వీ.. నెక్లెస్​తో లవర్​గా కన్ఫార్మ్ చేసింది.

లవర్​ నేమ్​తో కూడిన నెక్లెస్​ వేసుకున్న జాన్వీ

కాఫీ విత్ కరణ్​లో కూడా షీకూ బెస్ట్ ఫ్రెండ్ అంటూ చెప్పుకొచ్చింది కానీ లవర్​ అని చెప్పలేదు.

తన ఫ్రెండ్ అని చెప్తూనే పార్టీలు, ఈవెంట్లు, గుడికి వీరిద్దరూ కలిసి వెళ్లిన ఫోటోలు కూడా బాగా వైరల్ అయ్యాయి.

జాన్వీ ప్రస్తుతం హిందీలోనే కాకుండా తెలుగులో కూడా పలు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తుంది.