జన్మాష్టమి 2025

పిల్లలను చిన్ని కృష్ణుడిగా ఎలా అలంకరించాలో చూసేద్దాం.

Published by: Geddam Vijaya Madhuri
Image Source: Pinterest/ Swatilekha Maiti

క్యూట్ కన్నయ్య

జన్మాష్టమికి చాలామంది తమ పిల్లలను కృష్ణుడిగా అలంకరిస్తారు.ఈసారి మీరు కూడా మీ చిన్నారిని చిన్న కృష్ణుడిగా అలంకరించాలనుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే.

Image Source: Pinterest/ Harika Adulapuram

ధోతి

పురుషుల సాంప్రదాయ దుస్తులలో ఒకటైన ధోతీ కృష్ణుని దుస్తులకు తప్పనిసరిగా ఉండాలి. మీరు ఫోటో షూట్ ప్లాన్ చేస్తుంటే.. మీకు నచ్చిన రంగులో సౌకర్యవంతమైన కాటన్ లేదా సిల్క్ ధోతీని ఎంచుకోండి.

Image Source: Pinterest/ Horab Imshal

కిరీటం

కృష్ణుడి రూపానికి కిరీటం చాలా అవసరం. మీ చిన్నారి చర్మానికి ఇబ్బంది కలిగించని తేలికైన కిరీటాన్ని ఎంచుకోవాలి.

Image Source: Pinterest/ Nikita Raaj

నెమలి ఈక

నెమలి ఈక కృష్ణుని రూపాన్ని పూర్తి చేస్తుంది. ఇది కృష్ణుని ప్రకృతితో ఉన్న దైవిక సంబంధానికి ప్రతీక.

Image Source: Pinterest/ BTS ARMY'

పిల్లన గ్రోవి

కృష్ణుడు ‘మురళీధర్’గా ప్రసిద్ధి చెందాడు. కాబట్టి వేణువు మీ పిల్లాడి మేకప్ లుక్లో కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి.

Image Source: Pinterest/ Pihusharma

మంటి కుండ

చిన్న వెన్న కుండ కూడా ఫోటోషూట్కి సిద్ధం చేసుకోవాలి. కృష్ణుడికి వెన్న అంటే ఉన్న ప్రేమకు ఇది చిహ్నం.

Image Source: Pinterest/ Tulsi Makadiya

ఆభరణాలు

కృష్ణుని వేషధారణకు ఆభరణాలు చాలా ముఖ్యం. మీ చిన్నారి రూపాన్ని మెరుగుపరచడానికి సాధారణ నెక్లెస్లు, బ్రాస్లెట్లు, ముత్యాల దండలతో అలంకరించాలి.

Image Source: Pinterest/ Ram Prasad

తిలకం

పిల్లల నుదుటిపై ఆధ్యాత్మిక లుక్ కోసం 'తిలకం' అప్లై చేయండి. పిల్లల చర్మాన్ని రక్షించుకునేందుకు ఎలాంటి మేకప్ వేయకపోవడమే మంచిది.

Image Source: Pinterest/ Saranya