ఉదయాన్నే కాస్త బెల్లం తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెప్తున్నారు నిపుణులు.

జీర్ణ సమస్యలు దూరమవుతాయి. శరీరంలోని టాక్సిన్లు బయటకు వెళ్లడంలో హెల్ప్ చేస్తుంది.

దీనిలోని ఐరన్, జింక్, సెలెనియం వంటి మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

మలబద్ధకం సమస్యతో ఇబ్బంది పడేవారు గోరువెచ్చని నీటితో బెల్లం తీసుకుంటే మంచిది.

లివర్​ని డీటాక్స్ చేసి.. కాలేయంలోని ఫ్లష్​ని, టాక్సిన్లను బయటకు పంపేస్తుంది.

రక్తంలో హిమోగ్లోబిన్ లెవెల్స్​ని పెంచి.. ఎనిమియా సమస్యల నుంచి దూరం చేస్తుంది.

సహజమైన కార్బ్స్ శరీరానికి అందుతాయి. ఇవి శరీరానికి మంచి ఎనర్జీని అందిస్తాయి.

ఉదయాన్నే 5 నుంచి 10 గ్రాముల బెల్లం తీసుకోవచ్చు. రెగ్యులర్​గా తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి.

ఎక్కువ బెల్లం తింటే రక్తంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. కడుపు ఉబ్బరం కూడా అవుతుంది.

చలికాలంలో లేదా చల్లగా ఉన్న సమయాల్లో బెల్లం తింటే మంచి ప్రయోజనాలు పొందవచ్చు.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది.