పిల్లలకు ప్లాస్టిక్ బాక్సులలో ఫుడ్ పెడుతున్నారా? అయితే, జాగ్రత్త! పిల్లలకు తల్లిదండ్రులు రకరకాల రంగుల టిఫిన్ బాక్సులలో ఫుడ్ పెడతారు. ముఖ్యంగా ప్లాస్టిక్ బాక్సులలో స్నాక్స్, లంచ్ పంపిస్తుంటారు. ప్లాస్టిక్ బాక్సులు పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయంటున్నారు నిపుణులు. వేడి ఆహార పదార్థాలు ప్లాస్టిక్ బాక్సులలో పెట్టడం వల్ల ప్లాస్టిక్ కరిగి ఫుడ్ లో కలిసిపోతుంది. ప్లాస్టిక్ బ్యాక్సులలోని హానికరమైన రసాయనాలు పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ముఖ్యంగా పిల్లల రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. పిల్లలు ఈజీగా ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఉంటుంది. ప్లాస్టిక్ బాక్సులకు బదులుగా స్టీలు బాక్సులు ఉపయోగించడం మంచిదంటున్నారు. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com