ఉప్పు ఎక్కువే కాదు, తక్కువ తిన్నా ప్రమాదమే! ఉప్పు ఎక్కువ తినడం వల్ల హైబీపీ ఏర్పడే అవకాశం ఉంది. ఉప్పు తక్కువ తీసుకున్నా ముప్పు తప్పదంటున్నారు నిపుణులు. శరీరానికి సరిపడా ఉప్పును తీసుకుంటే కండరాల్లో కదలికలు బాగుంటాయి. మెదడులోని నాడులు, కండరాలు యాక్టివ్ గా పనిచేస్తాయి. ఉప్పు తినడం మానేస్తే కణాల లోపల ఒత్తిడి పెరిగిపోతుంది. తల తిరగడం, కళ్ళు తిరిగి పడిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్నిసార్లు కోమాలోకి కూడా వెళ్ళవచ్చు. అందుకే రోజు సుమారు 5 గ్రాముల ఉప్పు తీసుకుంటే మంచిది. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: Pixabay.com