కొబ్బరి బొండంలో నీళ్లు ఎలా ఏర్పడతాయో తెలుసా?



వేసవి కాలం వచ్చిందంటే కొబ్బరి నీటికి ఎంత డిమాండ్ ఉంటుందో తెలిసిందే.



మరి, కొబ్బరి బొండం తాగేప్పుడు మీకు తప్పకుండా ఒక సందేహం కలిగే ఉంటుంది.



కొబ్బరి బొండంలోకి అంత తియ్యని నీరు ఎలా వస్తుందో అని అనుకొనే ఉంటారు.



కొబ్బరి చెట్టు నీటిని ఎక్కువగా గ్రహిస్తుంది. ఆ నీటిని కాయలు, ఆకులకు సరఫరా చేస్తుంది. ఆ నీటిని ఎండోస్పెరమ్ అంటారు.



కాయలోకి చేరిన ఎండోస్పెరమ్ క్రమేనా చిక్కబడి కణజాలంగా రూపాంతరం చెందుతుంది.



అలా రూపాంతరం చెందిన కణజాలంలోని చిక్కని ఎండోస్పెరమ్ తెల్లని కొబ్బరిగా గట్టిపడుతుంది.



మిగిలిన ఎండోస్పెర్మ్ స్వచ్ఛమైన కొబ్బరి నీరుగా మారిపోతుంది. కాయ ముదిరేకొద్ది నీరు తగ్గిపోతుంది.