ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వేడి నీళ్లు తాగితే జీర్ణక్రియ సజావుగా సాగుతుంది. ఫలితంగా పోషకాల శోషణ మరింత బావుంటుంది. వేడి నీటితో చెమట, మూత్రం ఎక్కువగా రావడం వల్ల సహజ టాక్సిన్లు తొలగిపోతాయి. పొద్దున్నే వేడినీళ్లతో రోజు మొదలు పెట్టడం వల్ల జీవక్రియలకు కిక్ స్టార్ట్ లా పనిచేస్తుంది. రోజంతా తరచుగా వెచ్చని నీళ్లు తాగడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. వేడి నీళ్లు తాగడం వల్ల సైనస్ లు క్లియర్ అవుతాయి. అందువల్ల శ్వాస క్రియ సజావుగా ఉంటుంది. వేడినీళ్లతో గొంతు నొప్పి నుంచి ఉపశమనం దొరుకుతుంది. తేనె, నిమ్మరసం కలిపితే మరింత మంచి ఫలితం ఉంటుంది. ఉదయాన్నే తాగే వేడి నీటి వల్ల ఒత్తిడి తగ్గుతుంది. మానసికంగా, శారీరకంగా కూడా ఉల్లాసంగా ఉంటుంది. వేడినీళ్లు తాగితే రక్తప్రసరణ కూడా బావుంటుంది. ఫలితంగా ఆక్సిజన్, పోషకాలు శరీరానికి చక్కగా అందుతాయి. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.