టీతో పాటు రస్కులు తినడం మంచిది కాదా?

పొద్దున్నే చాలా మంది టీతో పాటు రస్కులు తింటారు.

అలా తినడం వల్ల పలు ఆరోగ్య సమస్యలు ఏర్పడుతాయంటున్నారు నిపుణులు.

రస్కులు చాలా తక్కువ పోషక విలువలను కలిగి ఉంటాయి.

వీటిని తినడం వల్ల బరువు పెరిగే అవకాశం కూడా ఉంది.

రస్కులను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి.

శుద్ధిచేసిన పిండితో తయారైన రస్కులతో ఇన్సులిన్ నిరోధకత పెరుగుతుంది.

టైప్2 డయాబెటిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

రస్కులలోని తక్కువ ఫైబర్ కారణంగా పలు రకాల జీర్ణ సమస్యలు ఏర్పడుతాయి.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.