షేప్‌ వేర్స్‌ తో ఆరోగ్యానికి ఇంత ప్రమాదమా?

షేప్‌ వేర్స్‌ ధరించడం వల్ల యువతులు చూడ్డానికి స్లిమ్ లుక్ లో కనిపిస్తారు.

కానీ, షేప్‌ వేర్స్‌ అతిగా వాడటం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు.

షేప్‌ వేర్స్‌ పొట్ట చుట్టూ టైట్‌గా ఉండటం వల్ల ఆ ప్రాంతంలో గాలి సోకదు.

పొట్ట చుట్టూ చెమట ఏర్పడి ఇన్‌ఫెక్షన్‌ వచ్చే అవకాశం ఉంటుంది.

ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ కారణంగా చర్మం వాపు, దురద కలుగుతుంది.

పొట్ట భాగంలో రక్త ప్రసరణ సరిగా జరగక చాలా ఇబ్బందులు కలుగుతాయి.

షేప్‌ వేర్స్‌ ధరించిన తర్వాత కొంత మంది టాయిలెట్స్ కు వెళ్లక మూత్ర సమస్యలు ఏర్పడుతాయి.

పొట్టచుట్టూ షేప్‌ వేర్స్‌ బిగుతుగా ఉండటం వల్ల జీర్ణ సమస్యలు ఏర్పడుతాయి.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pixels.com