ఇలా చేస్తే గంటలు గంటలు కూర్చున్నా బరువు పెరగరు తెలుసా? చాలా మంది ఉద్యోగులు ఆఫీస్ లో గంటల తరబడి కూర్చోని పని చేస్తారు. శారీరక శ్రమ లేకపోవడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోయి ఊబకాయం వస్తుంది. ఆహారంలో మార్పులు చేసుకోవడం వల్ల బరువును కంట్రోల్ చేసుకోవచ్చు. ఆఫీస్‌కు వచ్చే ముందు పొద్దున్నే కచ్చితంగా బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవాలి. మార్నింగ్ ఛాయ్, కాఫీ, సిగరెట్లు వంటివి తీసుకోకూడదు. వీలైనంత వరకు తేలికపాటి ఫుడ్ తీసుకోవడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. లంచ్ తర్వాత రెండు గంటలకు తక్కువ కేలరీలు ఉన్న స్నాక్స్ తీసుకోవాలి. రాత్రి 8 గంటలలోపు తేలికపాటి ఆహారంతో డిన్నర్ కంప్లీట్ చేయాలి. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pixels.com