Image Source: pexels

రాత్రి పడుకునేముందు ఈ ఫుడ్స్ తినకూడదు

డార్క్ చాక్లెట్: కెఫిన్, అమైనో యాసిడ్ కంటెంట్ ఎక్కువగా ఉండే డార్క్ చాక్లెట్ రాత్రిపూట తినకూడదు.

ఐస్ క్రీం: ఐస్ క్రీం అంటే చాలా మందికి ఇష్టం. కానీ రాత్రి నిద్రించే ముందు ఐస్ క్రీం తినకూడదు. నిద్రకు ఆటంకం కలుగుతుంది.

చక్కెర: చక్కెర ఉన్న ఫుడ్స్ తీసుకోకూడదు. ఇది మీ శక్తిస్థాయిలను పెంచుతుంది. త్వరగా నిద్రించడం కష్టంగా మారుతుంది.

కాఫీ: రాత్రిపూట కాఫీ తాగితే నిద్రకు భంగం కలుగుతుంది. నిద్రించే ముందు కాఫీ తాగకూడదు.

జున్ను: రాత్రిపూట జున్ను తింటే సరిగ్గా నిద్రపట్టదు. అందులో అమైనో ఆమ్లం ఉంటుంది.

రెడ్ మీట్: ఇందులో ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది. జీర్ణం కావడానికి చాలా శక్తి అవసరం.

ఆల్కహాల్ : ఒక గ్లాస్ వైన్ లేదా బీర్ తాగినా నిద్రకు ఆటంకం కలిగిస్తుంది.

పిజ్జా: పిజ్జాలో ఉండే జున్నులో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. టొమాటో సాస్ లో ఆమ్లం ఉంటుంది. ఇవి నిద్రకు ఆటంకం కలిగిస్తాయి.

Image Source: pexels

టొమాటో : టొమాటోలు అధిక ఆమ్లతత్వాన్ని కలిగి ఉంటాయి. గుండెల్లో మంట లేదా అజీర్ణానికి కారణం అవుతాయి.