యాంటీబయాటిక్స్ తో మంచి కంటే చెడే ఎక్కువా?

ఈ రోజుల్లో చాలా మంది చిన్న ఆరోగ్య సమస్యలకే యాంటీబయాటిక్స్ వాడుతున్నారు.

ఎక్కువగా యాంటీబయాటిక్స్ తీసుకోవడం ఆరోగ్యానికి చాలా ప్రమాదం అంటున్నారు నిపుణులు.

యాంటీబయాటిక్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల బ్యాక్టీరియా వాటి నుంచి కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది.

బ్యాక్టీరియా తన స్వరూపాన్ని మార్చుకుని యాంటీబయోటిక్స్ దొరకకుండా తయారవుతుంది.

ఎన్నిరకాల యాంటీబయాటిక్స్ వాడినా తట్టుకుని నిలబడేలా బ్యాక్టీరియా శక్తిని కూడగట్టుకుంటుంది.

చిన్న సమస్యలకు యాంటీబయోటిక్స్ ఉపయోగిస్తే రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది.

జలుబు, దగ్గు లాంటి సమస్యలకు హోమ్ రెమిడీస్ తీసుకోవడం మంచిది.

అత్యవసర పరిస్థితుల్లోనే యాంటీబయోటిక్స్ వాడాలంటున్నారు వైద్యులు.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com