కాఫ్ సిరప్ ఆరోగ్యానికి మంచిది కాదా? దగ్గు తగ్గడానికి చాలా మంది కాఫ్ సిరప్ లు వాడుతారు. దగ్గు మందులు ఎక్కువగా వాడటం ఆరోగ్యానికి మంచిదికాదంటున్నారు నిపుణులు. కాఫ్ సిరప్ ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండెపోటు సమస్య తలెత్తే అవకాశం ఉంది. దగ్గు మందులు నిద్రలేమి, మానసిక ఆందోళనకు కారణం అవుతాయి. కొన్నిసార్లు దగ్గు మందులు మైగ్రేన్ తలనొప్పి కలిగిస్తాయి. కాఫ్ సిరప్ కారణంగా కడుపులో నొప్పితో పాటు జీర్ణ సమస్యలు ఏర్పడుతాయి. కొంత మందిలో అలెర్జీ, కీళ్ళ నొప్పులు, వాంతులు వచ్చే అవకాశం ఉంటుంది. దగ్గు మందులు చాలా కాలం తీసుకుంటే మొదడు మొద్దుబారిపోయే అవకాశం ఉంటుంది. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pixels.com