మలబద్దకం మాయం కావాలంటే రోజుకో యాపిల్ తినండి!

రోజుకో యాపిల్ తినడం వల్ల పలు అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి.

యాపిల్స్‌ లో ఫైబ‌ర్‌, విట‌మిన్ Cతో పాటు యాంటీఆక్సిడెంట్స్ పుష్క‌లంగా ఉంటాయి.

యాపిల్ జీర్ణ వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది.

మ‌ల‌బద్ధ‌కాన్ని సమర్థవంతంగా అరికట్టడంలో యాపిల్ ఉపయోగపడుతుంది.

యాపిల్‌ తొక్క‌లోని ఫైబ‌ర్ పేగు క‌ద‌లిక‌ల‌ను మెరుగుప‌రిచి మ‌లాన్ని మెత్తగా మార్చుతుంది.

మలబద్దకాన్ని యాపిల్ తొక్క ఈజీగా కంట్రోల్ చేస్తుంది.

డయేరియాతో బాధపడే వారు యాపిల్ తొక్కలేకుండా తినాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఉడికించిన యాపిల్ ముక్కలు తీసుకోవడం వల్ల గట్ ఆరోగ్యం పెరుగుతుందంటున్నారు.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pixels.com