భోజనం అరటాకులో వడ్డించడం ఏళ్లుగా వస్తున్న సంప్రదాయం. అరటాకులో భోజనం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

అరటాకులో విటమిన్లు A,C లు, పాలీఫెనాల్స్, మరికొన్ని సూక్ష్మ పోషకాలు కూడా ఉంటాయి.

వేడివేడి పదార్థాలు అరటాకు మీద వడ్డించడం వల్ల ఈ పోషక తత్వాలు ఆహారంలో చేరతాయి. ఆ భోజనంలో పోషక విలువలు పెరుగుతాయి.

అరటాకులోని పాలీఫెనాల్స్ అనే యాంటీఆక్సిడెంట్లు శరీరంలో ఫ్రీరాడికల్ చర్యలను అదుపుచేస్తాయి.

అరటాకు మీది మైనం వంటి పొర వల్ల వేడి పదార్థాలు వడ్డించినపుడు ఆ పదార్థాలకు ప్రత్యేక రుచి వస్తుంది.

ఒకసారి నీటితో కడిగి వాడుకోవచ్చు. ప్లాస్టీక్ డిస్పోజబుల్స్ తో పోలిస్తే ఇవి చాలా ఆరోగ్యకరం.

అరటాకులోని పాలీఫెనాల్స్ వల్ల అరటాకు భోజనం చేస్తుంటే చర్మం కూడా ఆరోగ్యంగా మెరుపులీనుతుంది.

అరటాకులో భోంచేస్తే జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.

Image Source: Pexels

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే