మరీ వేడిగా ఉన్న కాఫీ, టీలు తాగితే ముప్పు తప్పదా?

ఒత్తిడిలో ఉన్నప్పుడు కాఫీ లేదంటే ఛాయ్ తాగితే చాలా రిలీఫ్ కలుగుతుంది.

అయితే, మరీ ఎక్కువ వేడిగా ఉన్న కాఫీ, టీ తాగితే మంచిది కాదంటున్నారు నిపుణులు.

ఎక్కువ వేడి ఉన్న టీ, కాఫీతో ఈసోఫేగస్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందంటున్నారు.

గొంతు నుంచి పొట్ట వరకు ఉండే ఆహారనాళాన్ని ఈసోఫేగస్ అంటారు.

వేడి కాఫీ, టీలు తాగడం వల్ల సున్నితంగా ఉండే అన్నవాహిక దెబ్బతింటుంది.

అన్నవాహికకు పుండ్లు ఏర్పడటంతో పాటు మంటకు కారణం అవుతుంది.

పరిస్థితి తీవ్రం అయితే ఈసోఫేగస్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది.

టీ, కాఫీలతో పాటు మరీ వేడిగా ఉండే డ్రింక్స్ తీసుకోకూడదని డాక్టర్లు చెప్తున్నారు.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com