Image Source: Pexels

నిలబడి తింటున్నారా? జరిగేది ఇదే!

ఒకప్పుడు పెళ్లిల్లు, ఫంక్షన్స్‌లో కుర్చీలు, బల్లలు వేసి భోజనాలు పెట్టేవారు.

కాలం మారడంతో ‘బఫె’ సిస్టం వచ్చింది. బరువైన ప్లేట్లు పట్టుకుని అంతా నిలబడే తింటున్నారు.

ఆఫీసుల్లో కూడా స్పేస్ సేవ్ చేయడం కోసం నిలబడి తినేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు.

మరి, నిలబడి ఆహారం తినడం ఆరోగ్యానికి మంచిదేనా? ఏం జరుగుతుంది?

నిలబడి తినడం వల్ల ఆహారం వేగంగా జీర్ణమవుతుంది. కొవ్వు తగ్గే అవకాశం ఉంది.

అయితే, కడుపు ఉబ్బరం, బరువు పెరిగే అవకాశాలూ ఉన్నాయ్. ఆకలి కూడా వేయొచ్చు.

కొందరికి యాసిడ్ రిఫ్లెక్స్ వల్ల గుండెల్లో మంట రావచ్చు. గ్యాస్ సంబంధిత సమస్యలూ రావచ్చు.

ఆయుర్వేదం ప్రకారం.. నేలపై కూర్చొని తినడం శ్రేయస్కరం.

గమనిక: పలు అధ్యయనాల్లో పేర్కొన్న విషయాలను యథావిధిగా అందించాం.

Image Credit: Pexels