ఆరోగ్యానికి ఆవు నెయ్యి మంచిదా? గేదె నెయ్యి మంచిదా? నెయ్యితో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. నెయ్యి జీర్ణ వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు రోగ నిరోధకశక్తిని పెంచుతుంది. హార్మోన్స్ ను బ్యాలెన్స్ చేయడంలో నెయ్యి కీలకపాత్ర పోషిస్తుంది. శరీరం కాంతివంతంగా కనిపించేందుకు సాయపడుతుంది. ఆవు నెయ్యి మంచిదా? గేదె నెయ్యి మంచిదా? అని చాలా మందిలో సందేహం కలుగుంది. రెండింటిలోనూ ఒకే రకమైన పోషకాలు ఉంటాయంటున్నారు నిపుణులు. వెయిట్ మెయింటెయిన్ చేయాలి అనుకునే వాళ్లు ఆవు నెయ్యి తీసుకుంటే మంచిది. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.