పెద్ద ఉసిరికాయలను రాగి ఉసిరికాయలు అంటారు. ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచివి. ముఖ్యంగా సమ్మర్లో వీటిని తీసుకుంటే కలిగే బెనిఫిట్స్ అన్ని ఇన్ని కాదు. వీటిలో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ఇమ్యూనిటీని అందిస్తుంది. సమ్మర్లో హైడ్రేటింగ్‌గా ఉండడం కోసం వీటిని తీసుకోవచ్చు. డీహైడ్రేషన్‌ని దూరం చేసుకోవచ్చు. మీకు బాగా వేడి చేస్తుందా? లోపలి నుంచి వేడిని తగ్గించడం కోసం వీటిని తినవచ్చు. మెరుగైన జీర్ణక్రియను అందించడమే కాకుండా మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. స్కిన్ హెల్తీగా ఉంచి.. పింపుల్స్‌ని దూరం చేయండలో ఇవి బాగా హెల్ప్ చేస్తాయి. ఇవి కేవలం అవగాహన కోసమే. వైద్యుల సలహా తీసుకుని ఫాలో అయితే మంచిది. (Images Source : Pinterest)