పొరపాటున చూయింగ్ గమ్ మింగితే ముప్పు తప్పదా?

చూయింగ్ గమ్ నమిలే వాళ్లు ఒక్కోసారి అనుకోకుండా మింగేస్తారు.

చాలా మంది చూయింగ్ గమ్ మింగేసి చాలా భయపడుతూ ఉంటారు.

అది పేగులకు చుట్టుకుపోయి అక్కడే ఉండిపోతుందని ఆందోళనపడుతారు.

కొంత మంది ఏడేళ్ల వరకు చూయింగ్ గమ్ బయటకు రాదని చెబుతారు.

కానీ, చూయింగ్ గమ్ 12 నుంచి 48 గంటల్లో మలవిసర్జన ద్వారా బయటకు వచ్చే అవకాశం ఉంది.

అరుదైన పరిస్థితుల్లో మాత్రమే చూయింగ్ గమ్ వల్ల ఇబ్బందులు వస్తాయి.

చూయింగ్ గమ్ బయటకు రాకపోతే వాంతులు, కడుపునొప్పి, మలబద్ధకం, విరేచనాలు అవుతాయి.

ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ ను కలిసి తగిన చికిత్స తీసుకోవడం మంచిది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: Pixels.com