మార్కెట్లో ఎన్నో రకాల ఖర్జూరాలు అందుబాటులో ఉంటాయి.

ఇటీవల ఖర్చూరాలకు బాగా డిమాండ్ పెరిగింది. ఇవి స్వీటుగా భలే రుచిగా ఉంటున్నాయ్.

ఎండు ఖర్చూరాలు తినడం బెటరా? లేదా సాధారణ ఖర్జూరాలు తినాలా అనే సందిగ్ధం కూడా ఉంది.

మార్కెట్లో లభిస్తున్న సాధారణ ఖర్జూరాల్లో తేమ ఎక్కువ. 8 నుంచి 10 నెలలు మాత్రమే నిల్వ ఉంటాయి.

ఎండు ఖర్జూరాలను గాలి తగలని ప్రాంతంలో ఉంచితే 5 ఏళ్లు నిల్వ ఉంటాయి.

ఎండు ఖర్జూరాల్లో చక్కెర, క్యాలరీలు ఎక్కువ. సాధారణ ఖర్చూరాల్లో తక్కువ.

100 గ్రాముల ఎండు ఖర్జూరంలో దాదాపు 280 క్యాలరీలుంటాయి, సాధారణ ఖర్జూరంలో 145 క్యాలరీలుంటాయి.

రెండు రకాల ఖర్జూరాల్లో ఐరన్ పుష్కలం. అయితే, ఎండు ఖర్జూరంలో కాస్త ఎక్కువ ఉంటుంది.

సాధారణ ఖర్జూరాల్లో విటమిన్-సి ఉంటుంది. డయాబెటిక్స్ ఈ ఖర్జూరాలే బెటర్.

నోట్: సాధారణ ఖర్జూరాలంటే నలుపు, రంగులో లభించే పండ్లు.

గమనిక: అనారోగ్య సమస్యలున్నవారు డాక్టర్‌ను సంప్రదించిన తర్వాతే వీటిని తీసుకోవాలి.