ఏ వయసు వాళ్లు ఎన్ని గంటలు నిద్రపోతే మంచిదో తెలుసా?

శరీరానికి ఆహారం ఎంత అవసరమో, నిద్ర కూడా అంతే ముఖ్యం.

సరైన నిద్ర లేకపోతే బోలెడు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

అయితే, ఎంత సమయం నిద్రపోవాలి అనేది వయసుకు తగ్గట్టు ఉంటుంది.

అప్పుడే పుట్టిన పిల్లలు ప్రతి రోజూ 18 గంటల పాటు నిద్రపోతూనే ఉంటారు.

6 నుంచి 13 ఏళ్ల మధ్య గల పిల్లలకు 11 గంటల నిద్ర అవసరం.

14 నుంచి 17 ఏళ్ల టీనేజీ పిల్లలు కనీసం రోజుకు 8 నుంచి 10 గంటలు నిద్రపోతే మంచిది.

18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉన్న యువత 8 నుంచి 9 గంటలు నిద్రపోవాలి.

25 నుంచి 65 సంవత్సరాల మధ్య గల వారంతా రోజుకు 7 నుంచి 8 గంటలకు తగ్గకుండా నిద్రపోవాలి.

65 ఏళ్ల వయసు దాటినవారు కచ్చితంగా రోజులో 10 గంటల పాటు నిద్రపోవాలి.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: Pixels.com