అన్నం తినాలా వద్దా? తింటే బ్రౌన్ రైస్ తినాలా? వైట్ రైస్ తినాలా? అని ఆలోచిస్తున్నారా?

బ్రౌన్ రైస్ లో ఫైబర్, విటమిన్లు, మినరల్స్ వైట్ రైస్ కంటే ఎక్కువ. వైట్ రైస్‌ తెల్లగా కనిపించేందుకు ఈ పోషకాల పొరను తొలగిస్తారు.

బ్రౌన్ రైస్ లో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువ. ముఖ్యంగా వీటిలోని మాంగనీస్ కణజాల నష్టాన్ని నివారిస్తుంది.

బ్రౌన్ రైస్ లోఉండే ఫైబర్ వల్ల గ్లూకోజ్ శోషణ నెమ్మదిగా సాగుతుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది.

బ్రౌన్ రైస్ లోని ఫైబర్ వల్ల ఎక్కువ సేపు కడుపు నిండిన భావన కలిగి.. క్యాలరీలు తక్కువ తీసుకుంటారు.

బ్రౌన్ రైస్ లో ఉండే నూనెల వల్ల కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది.

తెల్లబియ్యంలో సాధారణంగా దొరకని మెగ్నీషియం, ఫాస్ఫరస్, సెలీనియం, ఐరన్ బ్రౌన్ రైన్ ద్వారా అందుతాయి.

ఫైబర్ ఉండడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యం బావుంటుంది. మలబద్దకం ఏర్పడదు.

బ్రౌన్ రైస్ లో గ్లుటెన్ ఉండదు. గ్లుటెన్ సెన్సిటివిటి ఉన్న వారికి ఇదొక మంచి కార్బోహైడ్రేట్ ఆప్షన్.

బ్రౌన్ రైస్ కి ఒక ప్రత్యేక రుచి, టెక్ఛర్ ఉంటుంది. ఇది వైట్ రైస్‌లో ఉండదు.

Image Source: Pexels and Pixabay

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.

Thanks for Reading. UP NEXT

వేసవిలో మిమ్మల్ని ‘చల్ల’గా ఉంచే ఫుడ్స్ ఇవే

View next story