ఏనుగుల గురించి ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసా?

ఏనుగులు భూమిపై అతిపెద్ద జంతువులు. ఆఫ్రికన్ ఏనుగులైతే.. ఏకంగా 6 టన్నుల బరువు ఉంటాయి.

ఏనుగు ఫ్యాన్ ఆకారపు చెవులు కలిగి ఉంటాయి. ఇవి సుదూర శబ్ధాలను వినడానికి హెల్ప్ చేస్తాయి.

ఏనుగులు భూమిపై అత్యంత తెలివైన జంతువులలో ఒకటిగా చెప్తారు. వీటి మెదడు నిర్మాణం మానవ మెదడుకు సమానంగా ఉంటుంది.

ఏదైనా ఏనుగు మరణిస్తే.. అవి తమ సంతాపాన్ని చూపిస్తాయి. సానుభూతి, కనికరం చూపిస్తాయి.

మీకు తెలుసా ఏనుగులు తమ గర్జనలతో అనేక రకాల స్వరాల ద్వారా పరస్పరం కమ్యూనికేట్ చేసుకుంటాయట.

ఏనుగులు పూర్తిగా శాఖాహారులు. గడ్డి, ఆకులు, పండ్లతో సహా అనేక రకాల మొక్కలను తింటాయి.

ఏనుగులు నీటిని స్టోర్ చేసుకోగలవు. ఆహారం, నీరు, అనుకూలమైన ఆవాసాల కోసం వలసపోతాయి.

ఏనుగులు దాదాపు 70 ఏళ్లు బతుకుతాయి. పరిస్థితులు, ఆహారం, అనుకూలతను బట్టి ఇవి మారుతూ ఉంటాయి.

ఏనుగులు బాగా స్విమ్ చేస్తాయట. మైళ్ల దూరం కూడా స్విమ్ చేయగలుగుతాయట.