ఇండియన్ క్రికెటర్ శుభ్​మన్ గిల్ తన ఆటతీరుతో, లుక్స్​తో ఎందరినో ఆకట్టుకున్నాడు.

ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్​కి కెప్టెన్​గా చేస్తూ ఐపీఎల్​లో అదరగొడుతున్నాడు.

అయితే ఈ స్టైలిష్ క్రికెటర్​ ఫిట్​నెస్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు.

శుభ్​మన్ గిల్ తన స్టామినాను పెంచుకునేందుకు డెడ్​ లిఫ్ట్​లు, స్క్వాట్​లు ఎక్కువగా చేస్తాడు.

హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్​ తీసుకుంటాడు గిల్. ఇవి ఫిట్​గా ఉండడంతో పాటు స్టామినాను పెంచడంలో హెల్ప్ చేస్తాయి.

కోర్, స్టెబులిటీ వ్యాయామాలు కూడా గిల్​ని ఫిట్​గా ఉంచడంలో హెల్ప్ చేస్తాయి.

యోగా చేయడం, స్ట్రెచ్ వంటి వాటిని కూడా శుభ్​మన్ గిల్ ఫాలో అవుతూ ఉంటాడు.

ప్రోటీన్​తో నిండిన, కార్బ్స్ తక్కువగా ఉండే ఆహారాన్ని గిల్ ఎక్కువగా తీసుకుంటానని తెలిపాడు.

అలాగే హైడ్రేటెడ్​గా ఉండేందుకు నీటిని, ఇతర ఫ్లూయిడ్స్ రెగ్యులర్​గా తీసుకుంటాడట.