Image Source: pexels

మహిళలూ వేసవిలో ఈ ఫుడ్స్ తింటే ఎముకలు బలంగా ఉంటాయ్

బాదం వెన్నలో కొలెస్ట్రాల్ తక్కువగా.. కాల్షియం పుష్కలంగా ఉంటుంది. వేరుశనగల్లో కంటే ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది.

బ్రోకలీలో విటమిన్ సి, ఫైబర్, పోషకాలు ఉంటాయి. కాల్షియాన్ని అధిక మొత్తంలో అందిస్తుంది.

ఎముకల ఆరోగ్యానికి కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం సహా అనేకపోషకాలు ఉన్న చియా సిడ్స్ తీసుకోవాలి.

పాలలో ఉండే కాల్షియం, విటమిన్ డి, ఫాస్పరస్, మెగ్నీషియం వంటి పోషకాలు ఎముకలను బలంగా ఉంచుతాయి.

బాదంలో మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్ ఉన్నాయి. ఇవి ఎముకలను బలంగా,ఆరోగ్యంగా ఉంచుతాయి.

పాలతోతయారు చేసిన చీజ్ లో కాల్షియం ఉంటుంది. మోజారెల్లాలో కాల్షియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.

గుడ్లలో విటమిన్ డి,పచ్చసొనలో కూడా ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

సాల్మన్ చేపలు తింటే విటమిన్ డి అందుతుంది. క్యాన్డ్ సాల్మన్ లో ఉండే కాల్షియం ఎముకలకు మేలు చేస్తుంది.

Image Source: pexels

పెరుగులో కాల్షియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. పాల కంటే పెరుగులోనే పుష్కలంగా ఉంటుది.