జుట్టు పొడవుగా ఉండేవారు ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే జుట్టు పెంచుకోవడమంటే చాలామందికి ఇష్టం. మీరు కూడా అలాంటివారిలో ఒకటా? అయితే మీ జుట్టును కాపాడుకోవడానికి మీ లైఫ్ స్టైల్లో కొన్ని మార్పులు చేయాలి. రెగ్యూలర్‌గా వీటిని ఫాలో అయితే జుట్టు పై నుంచి కిందివరకు హెల్తీగా ఉంటుంది. వారంలో 2 లేదా మూడు సార్లు షాంపూ చేయాలి. సల్ఫెట్ ఫ్రీ షాంపూలతో మృదువుగా స్కాల్ప్‌ని రబ్ చేస్తూ క్లీన్ చేసుకోవాలి. కచ్చితంగా కండీషనర్ అప్లై చేయాలి. దీనివల్ల జుట్టు డ్రై కాకుండా ఉంటుంది. 6 లేదా 8 వారాలకు ఓసారి జుట్టు చివర్ల ట్రిమ్ చేయాలి. దీనివల్ల స్ప్లిట్ ఎండ్స్ దూరమై జుట్టు పెరుగుతుంది. జుట్టు తెగిపోకుండా ఉండేందుకు మైక్రో ఫైబర్ టవల్‌తో జుట్టును ఆరబెట్టుకోవాలి. హీట్ టూల్స్ ఉపయోగించకోవడమే మంచిది. చేయాల్సి వస్తే హీట్ ప్రొటెక్టర్ పెట్టుకోవాలి. వైడ్ కోంబ్ ఉపయోగించి జుట్టును చిక్కులు తీయాలి. జుట్టు కింద నుంచి చిక్కులు పైకి తీసుకుంటూ వెళ్లాలి. ఈ టిప్స్‌తో మీ జుట్టు హెల్తీగా ఉంటుంది. పెరుగుదల బాగుంటుంది. (Images Source : Enavto)