జీన్స్ వేసుకుని పడుకునే అలవాటు ఉందా? వెంటనే మానుకోండి! రాత్రిపూట పడుకునేటప్పుడు వదలు దుస్తులు వేసుకోవడం మంచిది. శరీరానికి కావాల్సినంత గాలి తగిలి చక్కగా నిద్రపడుతుంది. కొంత మంది జీన్స్ లాంటి బిగుతైన దుస్తులు ధరించి పడుకుంటారు. జీన్స్ వేసుకుని పడుకోవడం చాలా ప్రమాదం అంటున్నారు నిపుణులు. రాత్రిపూట జీన్స్ ధరించి పడుకోవడం వల్ల శరీరంలో వేడిపెరిగి సరిగా నిద్రపట్టదు. జీన్స్ చెమటను పీల్చుకోకపోవడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఏర్పడుతాయి. జననాంగాల దగ్గర చర్మం ఎర్రబారడంతో పాటు దద్దుర్లు ఏర్పడుతాయి. జీన్స్ వేసుకొని నిద్రపోవడం వల్ల మహిళల్లో నెలసరి సమస్యలు ఏర్పడుతాయి. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.Photos Credit: pexels.com