తెల్ల బియ్యం మరింత ప్రాసెస్ చెయ్యబడిన బియ్యం కనుక ఇందులో ఎక్కువ పిండి పదార్థం తక్కువ పోషకాలు మిగులుతాయి.

బ్రౌన్ రైస్ లో తెల్లబియ్యం లో కంటే ఎక్కువ పోషకాలు ఉంటాయి.

విటమిన్ B1 లేదా థయామిన్ వరిలో ఎక్కువ. ఇది జీవక్రియలను మెరుగ్గా ఉంచుతుంది.

కార్బోహైడ్రేట్లను గ్లూకోజ్ గా మార్చి శరీరం వినియోగించుకునేందుకు వీలుగా శక్తిగా మార్చేందుకు థయామిన్ చాలా అవసరం.

నియాసిన్ అంటే విటమిన్ B3 అన్నంతో లభిస్తుంది. ఇది బీపి అదుపు చేసేందుకు, మెదడు పనితీరు మెరుగ్గా ఉండేందుకు అవసరం.

నియాసిన్ చర్మాన్ని రక్షిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

ఫోలెట్ అనే విటమిన్ B5 శరీరంలో జీవక్రియలు సజావుగా సాగేందకు చాలా అవసరం. ఫోలేట్ రకరకాల క్యాన్సర్లను కూడా నివారిస్తుంది.

విటమిన్ B2 రిబోఫ్లేవిన్ నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. లివర్, చర్మం, జుట్టు, కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

Image Source: Pexels

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.