చేతబడి మిమ్మల్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసా? వైద్యులు సైతం గుర్తించలేని తలనొప్పి, తలతిరగటం, శరీరనొప్పులు వంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. పని, ఆరోగ్యం వంటి పలు అంశాల్లో ఊహించని బ్యాడ్ లక్ మీకు ఎదురవుతుంది. ఆర్థిక వ్యవహారాలను చక్కగా నిర్వహించినప్పటికీ.. కారణాలు లేకుండా ఆకస్మిక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కుంటారు. మీ నిద్రకు భంగం కలిగించే, భయపడే పీడకలలు వస్తుంటాయి. రాత్రి బాగా నిద్రపోయినప్పటికీ ఎలాంటి కారణం లేకుండానే అలసిపోయినట్లు, శక్తి తగ్గినట్లు అనిపిస్తుంది. ఎలాంటి కారణాలు లేకుండా భార్యభర్తల మధ్య అపార్థాలు, భావోద్వేగ దూరాన్ని పెంచుతుంది. భయంకరమైన, ప్రతికూల ఆలోచనలు ఇబ్బంది పెడుతుంటాయి. రాత్రి సమయంలో లేదా మీరు ఒంటరిగా ఉన్నప్పుడు అడుగులు వేస్తున్నట్లు, కొట్టడం వంటి వింత శబ్దాలు వింటారు. ముఖ్యమైన వస్తువులను తరచుగా పోగొట్టుకుంటారు. రహస్య ప్రదేశాల్లో ఉంచినా మిస్ అవుతాయి.