ఒత్తిడి, ఆందోళనతో మీ శరీరంలో జరిగే మార్పులివే, తేలిగ్గా తీసుకోవద్దు ఒత్తిడి, ఆందోళన శరీరంలోని పలు భాగాలపై ప్రభావం చూపుతాయి. ఒత్తిడి అనేది కండరాలు, కీళ్ల నొప్పులకు కారణం అవుతుంది. గుండెస్పందన రేటు, రక్తపోటును పెంచుతుంది. శ్వాసకోశ సమస్యలను తీవ్రం చేస్తుంది. ఒత్తిడి చర్మ సమస్యలకు కూడా కారణం అవుతుంది. మొటిమలు, తామర, సోరియాసిస్ వంటి సమస్యలకు దారితీస్తుంది. గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి వంటి సమస్యలను కారణం అవుతుంది ఒత్తిడి.. తలనొప్పి, మైగ్రేన్, దవడ నొప్పి వంటి సమస్యలకు దారి తీస్తుంది. ఒత్తిడి బుుతుచక్రాలను కూడా ప్రభావితం చేస్తుంది. సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతుంది. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.