వర్షాకాలం ప్రారంభమయ్యే ముందు నేరేడు పండ్లు విరివిగా దొరుకుతాయి. ఇవి ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తాయి. అంతేకాకుండా తక్కువ ధరకే లభ్యమవుతాయి. తక్కువ కేలరీలు కలిగిన ఈ పండ్లను తక్కువ మోతాదులో అందరూ తీసుకోవచ్చు అంటున్నారు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకుంటే ఈ పండ్లు మంచి ఎంపిక అని చెప్తున్నారు. వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది టాక్సిన్లను దూరం చేసి బరువు తగ్గేలా చేస్తుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు సీజనల్ వ్యాధులు సోకకుండా ఇమ్యూనిటినీ పెంచుతాయి. తక్కువ కేలరీలతో నిండిన ఈ పండ్లు ఆకలిని తగ్గించి.. బరువు పెరగకుండా చేస్తాయి. మరి ఈ పండ్లను మధుమేహం ఉండే వారు తీసుకోవచ్చా అంటే.. కచ్చితంగా తీసుకోవాలంటున్నారు. వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ మోతాదులో ఉండి.. బ్లడ్ షుగర్‌ను కంట్రోల్ చేస్తుంది. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్ బారిన పడకుండా శరీరాన్ని రక్షిస్తాయి. ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు పాటిస్తే మంచిది. (Images Source : Envato)