వర్షాకాలంలో ఈ కూరగాయలను అస్సలు తినకండి! ఆయా సీజన్లలో దొరికే పండ్లు, కూరగాయలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే, వర్షాకాలంలో కొన్ని కూరగాయలు, ఆకుకూరలను తీసుకోకూదంటారు నిపుణులు. వర్షాకాలంలో క్యాలీఫ్లవర్, క్యాబేజీ వీలైనంత వరకు తినకూడదు. వీటిలోని శీతలీకరణ లక్షణాలు కడుపు నొప్పికి కారణం అవుతాయి. వానాకాలంలో పాలకూర, బచ్చలికూర కూడా జీర్ణ సమస్యలకు కారణం అవుతాయి. వర్షాకాలంలో క్యాప్సికమ్ తినడం మంచిది కాదు. క్యాప్సికమ్ గ్యాస్, ఉబ్బరం, ఛాతిలో మంటకు కారణం అవుతాయి. వానాకాలంలో పాల పదార్థాలను కూడా వీలైనంత వరకు తీసుకోకూడదు. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.Photos Credit: pexels.com