పిల్లలకు హెల్తీ ఫుడ్ పెట్టాలని తల్లిదండ్రులు చూస్తారు.

అయితే వాటిని తినేందుకు ఇష్టపడరు. అలాంటి సమయంలో ఈ తరహా ఫుడ్స్ ట్రై చేయండి.

ఇవి వారికి వివిధ పోషకాలను అందించడమే కాకుండా టేస్టీగా కూడా ఉంటాయి.

స్ప్రౌట్స్​ను ఉడికించి.. తాళింపు వేసి పిల్లలకు స్నాక్స్​గా పెట్టవచ్చు.

ఇవి రుచిని అందిస్తాయి. అంతేకాకుండా కావాల్సినంత ప్రోటీన్ దక్కుతుంది.

క్రమం తప్పకుండా సీజన్స్​కు తగ్గట్లు ఫ్రూట్స్ వారికి ఇస్తూ ఉండాలి.

నువ్వుల లడ్డూలు వంటి వాటి ద్వారా కాల్షియం అందుతుంది. వీటిని హెల్తీ స్నాక్​గా ఇవ్వొచ్చు.

లంచ్​లో ఏ కర్రీ అయినా కాస్త ఎక్కువగానే పెట్టాలి.

అలాగే లంచ్ బాక్స్​లో కచ్చితంగా పెరుగు ఉండేలా చూసుకుంటే మంచిది.

ఈ తరహా ఫుడ్ పిల్లలకు మంచి రుచితో పాటు ఆరోగ్యాన్ని అందిస్తాయి.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహా తీసుకుంటే మంచిది. (Images Source : Envato)