పిల్లల చేతికి స్మార్ట్ ఫోన్ ఇస్తే.. ఇక అంతే సంగతులు! పిల్లలకు స్మార్ట్ ఫోన్లు ఇవ్వడం వల్ల చాలా ఇబ్బందులు కలుగుతాయి. రోజుకు 4 గంటల కంటే ఎక్కువ సేపు స్మార్ట్ ఫోన్ చూసే వారికి తీవ్ర నష్టం కలుగుతుంది. పిల్లల్లో మానసిక ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. ఒత్తిడి, ఆత్మహత్య ఆలోచనలు, చెడు ఆలోచనలు కలుగుతాయి. నిద్ర, కళ్లు, ఎముకలు, కండరాల సమస్యలు ఏర్పడుతాయి. సౌత్ కొరియన్ హన్యాంగ్ యూనివర్సిటీ పరిశోధనలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. సో, పిల్లలు ఎక్కువ సేపు స్మార్ట్ ఫోన్లు చూడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com