ఉదయాన్నే ఈ ఫుడ్స్ తింటే పీటీ ఉషలా పరుగెడుతారు ఉదయం వాకింగ్ సమయంలో హైడ్రేటెడ్ గా ఉండేందుకు నీళ్లు తాగుతుండాలి. వాకింగ్ తర్వాత బ్రేక్ ఫాస్టులో గ్రీకు పెరుగు, కాటేజ్ చీజ్, ప్రొటీన్ బార్ లు తీసుకోవాలి. ఇవి కండరాలను రిపేర్ చేస్తాయి. మీ గ్లైకోజెన్ నిల్వలను తిరిగి ఇవ్వడానికి క్వినోవా, స్వీట్ పొటాటో, మిల్లేట్స్ వంటి పిండి పదార్థాలు తీసుకోవాలి. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ను పొందడానికి సాల్మన్ వంటి కొవ్వు చేపలను ఆహారంలో చేర్చుకోవాలి. ఒంట్లో శక్తిని తిరిగి నింపడానికి ఎలక్ట్రోలైట్ ద్రవణాన్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. లేదంటే స్పోర్ట్స్ డ్రింక్స్ , కొబ్బరి నీళ్లు కూడా తాగవచ్చు. పండ్లు, కూరగాయలతోపాటు ప్రొటీన్ పౌడర్ లను తీసుకోవాలి. నారింజ లేదా స్ట్రాబెర్రీ వంటి విటమిన్ సి అధికంగా ఉన్న పండ్లను తినాలి. ఇమ్యూనిటీ పెంచుతాయి. వ్యాయామం తర్వాత శక్తిని నింపడానికి సహాయపడతాయి.