క్యారెట్ తో మెరిసే అందం మీ సొంతం క్యారెట్ ఆరోగ్యానికి ఎంతో సాయపడుతుంది. క్యారెట్ చర్మానికి మరింత నిగారింపు తీసుకొస్తుంది. క్యారెట్ లోని విటమిన్ A చర్మాన్ని మృదువుగా మార్చుతుంది. క్యారెట్ లోని రెటినాల్ కొలాజెన్ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తుంది. కొలాజెన్ చర్మం మీద ముడతలను రాకుండా కాపాడుతుంది. తరచుగా ఆహారంలో క్యారెట్ ను భాగం చేసుకోవడం వల్ల చర్మ సౌందర్యం పెరుగుతుంది. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.