కాఫీని ఇలా తాగితే ఈజీగా బరువు తగ్గవచ్చు!

కాఫీ తాగడంలో చిట్కాలు పాటిస్తే సులువుగా బరువు తగ్గించుకునే అవకాశం ఉంది.

చక్కెర, పాలు, స్వీటెనర్లు కలపకుండా బ్లాక్ కాఫీ తాగాలి.

దీనిలో క్యాలరీలు లేకపోవడం వల్ల బరువు పెరగరు.

బ్లాక్ కాఫీ శరీరంలో కొవ్వును కరిగించి బరువు పెరగకుండా కాపాడుతుంది.

కాఫీలో చక్కెరకు బదులుగా నేచురల్ స్వీట్నర్ స్టెవియా కలుపుకొని తాగితే మంచిది.

చక్కెరను దూరంగా పెట్టడం వల్ల బరువు పెరిగే అవకాశం తగ్గుతుంది.

పాలతో కాఫీ తాగేవారు వెన్న తీసిన పాలను వాడడం మంచిది.

పాలలో మీగడ తీయడం వల్ల కొవ్వు శాతం తగ్గి బరువు పెరగరు.

కాఫీలో కాస్త దాల్చిన చెక్క పొడిని కలిపితే కొవ్వుకరిగి బరువు తగ్గుతారు.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com