మెడ నొప్పి మొదలైన 48 గంటల్లోపు ఐస్ తో కాపడం పెట్టుకుంటే ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. అప్పుడే మొదలైన నొప్పి తగ్గుతుంది.

48 గంటలకు మించి నొప్పి కొనసాగుతున్నపుడు వేడి కాపడం మంచి ఫలితాలను ఇస్తుంది.

వేడి వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది. కండరాలు రిలాక్స్ అవుతాయి. చాలా కాలంగా ఉన్న అసౌకర్యం కూడా తగ్గుతుంది.

ఒక వస్త్రంలో ఐస్ ముక్కలు వేసి దాన్ని 15 -20 నిమిషాల పాటు మెడ మీద నొప్పి ఉన్న చోట పెట్టాలి.

45 నిమిషాల విరామం తర్వాత తిరిగి ఇలాగే ఐస్ కాపడం పెట్టుకోవాలి. ఫ్రాస్ట్ బైట్స్ వల్ల చర్మానికి నష్టం జరగవచ్చు.

హీటింగ్ ప్యాడ్ లేదా వేడి నీటిలో ముంచిన టవల్ తో మెడ మీద నొప్పి ఉన్న చోట15-20 నిమిషాలు కాపడం పెట్టుకోవాలి.

చర్మం కంది పోకుండా ఉండేంత వేడి మాత్రమే ఉండే విధంగా జాగ్రత్త పడాలి. ఎక్కువ సమయం పెడితే చర్మం కాలవచ్చు.

కొన్ని సార్లు వేడి, చల్లని కాపడాలను మార్చిమార్చి పెట్టడం వల్ల కూడా లాభం ఉంటుంది.

మొదట 15 నిమిషాల పాటు చల్లని కాపడం పెట్టాలి, తర్వాత 15 నిమిషాల పాటు వేడి కాపడం పెట్టాలి.

Image Source: Pexels

ఇలా మార్చి మార్చి పెట్టడం వల్ల ఇన్ఫ్లమేషన్ తగ్గతుంది. కండరాలు రిలాక్స్ అవుతాయి.

ఈ సమాచారం కేవలం అవగాహన కోసమే.