శరీరానికి నీళ్లు అవసరమనే విషయం గుర్తించడం ఆరోగ్యానికి చాలా అవసరం.

నోరు, గొంతు పొడిబారిన భావన కలుగుతోందంటే శరీరంలో డీహైడ్రేషన్ అవుతోందని గుర్తించాలి.

మూత్రం ముదురు రంగులో వస్తుంటే కూడా మీరు తగినన్ని నీళ్లు తాగడం లేదని అర్థం. మూత్రం లేత పసుపు రంగులో ఉండొచ్చు.

అసాధారణ రీతిలో అలసిపోతుంటే మీరు తగినన్ని నీళ్లు తాగడం లేదని, శరీరం డీహైడ్రేట్ అవుతోందని అర్థం

డీ హైడ్రేట్ అవుతున్నపుడు చర్మం పొడిబారుతుంది. సాగే గుణాన్ని కోల్పోతుంది.

డీహైడ్రేట్ అయినపుడు మెదడు తగినంత తేమ లేక సంకోచిస్తుంది. అందువల్ల తలనొప్పి వస్తుంది.

నీళ్ళు తగినన్నితాగక పోతే మలబద్దకం అవుతుంది.

ఒక్కోసారి దాహం ఆకలిలాగా అనిపిస్తుంది. భోంచేశాక కొద్ది సేపటికే మళ్లీ ఆకలిగా అనిపిస్తే నీళ్లు తాగాల్సిన అవసరం ఉందని గుర్తించాలి.

Image Source: Pexels

ఈ సమాాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే